తమ్ముడిని అభినందించిన అన్న
డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన పవన్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొలువు తీరారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. బుధవారం తనకు కేటాయించిన 2వ బ్లాకు లోని 211వ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. సంతకం చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు.
ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎంను సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగ బాబు కలిశారు. ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి ఆంజనేయులు , పిఠాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ మరెడ్డి శ్రీనివాస్ , తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజాగా జరిగిన శాసన సభ , లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలలో విజయ బావుటా ఎగుర వేసింది. ఊహించని రీతిలో 175 స్థానాలకు గాను 164 స్థానాలను కైవసం చేసుకుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.