సానుభూతి రాజకీయాలు మానేయ్
జగన్ పై నాగబాబు సెటైర్స్
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు (కొణిదెల నాగేంద్ర బాబు ) . ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుని తనపై రాయి దాడి జరిగిందంటే ఎవరు నమ్ముతారంటూ ప్రశ్నించారు.
సానుభూతి కోసం రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలను జనం పట్టించుకోరని తెలుసుకుంటే మంచిదన్నారు నాగబాబు. రాష్ట్రం క్షేమం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం తాము పొత్తు పెట్టుకున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 15 ఏళ్ల అమర్నాథ్ హత్య, 14 ఏళ్ల సుగాలి ప్రీతి హత్య, 30 వేల ఆడబిడ్డలు మిస్ అయితే స్పందించని వ్యక్తివి, సొంత బాబాయ్ ని చంపిన వారికి అండగా నిలబడే జగన్ ఇప్పుడు కంకరరాయి డ్రామాతో ముందుకొచ్చాడంటూ మండిపడ్డారు నాగ బాబు. ఆరు నూరైనా సరే తాము పవర్ లోకి వస్తామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా పార్టీ కోసం పని చేస్తున్న వాలంటీర్ల కృషి గొప్పదన్నారు. పిఠాపురంలో 10 వేల మందికి పైగా కార్యకర్తలు తమకు ఉన్నారని చెప్పారు. ఇక గెలుపు నల్లేరు మీద నడకేనని పేర్కొన్నారు.