అందుకే స్టేజీ పైకి వెళ్ల లేక పోయా
జనసేన ప్రధాన కార్యదర్శి నాగ బాబు
అమరావతి – తాడేపల్లి గూడెంలో జనసేన..టీడీపీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు జన విజయ కేతనం సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అయితే స్టేజీ పైకి ప్రధాన నాయకుడు, పవన్ కళ్యాణ్ సోదరుడు, ప్రముఖ నటుడు కొణిదెల నాగ బాబు లేక పోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వేదికపై పలువురు నేతలు ఆసీనులయ్యారు. దీంతో ఏమైంది..ఏం జరిగిందనే దానిపై సోషల్ మీడియా వేదికగా చర్చకు దారి తీసింది.
ఈ సందర్బంగా శుక్రవారం నాగ బాబు కొణిదెల స్పందించారు. తాను ఎందుకు వెళ్ల లేక పోయాననే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. సకాలంలో స్టేజి వద్దకు చేరుకోక పోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే సభా ప్రాంగణం అంతా జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులతో నిండి పోయిందన్నారు. దీంతో తాను వెళ్లేందుకు కూడా చోటు దొరక లేదని పేర్కొన్నారు.
వేలాది మంది పాల్గొన్న ఈ జన విజయ కేతన సభకు తాను వేదిక పైకి వెళ్లక పోవడం ఒకింత బాధకు గురవుతున్నట్లు తెలిపారు నాగ బాబు. ఎటువంటి ఆటంకాలు లేకుండా సభ సక్సెస్ అయినందుకు ఆనందంగా ఉందన్నారు.