NEWSANDHRA PRADESH

కొంద‌రి వాడు కాదు అంద‌రి వాడు – నాగ బాబు

Share it with your family & friends

స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌ముఖ న‌టుడు కొణిదెల నాగ బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న సోద‌రుడు, ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కొంద‌రు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌న త‌మ్ముడు అస‌లైన‌, సిస‌లైన స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కుడు అని స్ప‌ష్టం చేశారు నాగ బాబు.

నీ మతంతో పాటు సాటి మతాలని గౌరవించు, రక్షించు అని ‌సమానత్వాన్ని చాటిందే సనాతన ధర్మం అని పేర్కొన్నారు. ఆ ధ‌ర్మాన్ని పాటిస్తాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని తెలిపారు.

ఎన్నో మీటింగ్స్ ఉదృత స్థాయి లో జరుగుతున్నపుడు మసీదు నుంచి ఆజా వస్తే తన స్పీచ్ ని అజాన్ పూర్తయే దాక ఆపేసి నిశ్శబ్దం పాటిస్తాడని పేర్కొన్నారు నాగ‌బాబు. అది పర మతానికి అతనిచ్చే గౌరవం, మర్యాద అని తెలిపారు.

పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని హిందువులు మాత్రమే కాదు, క్రైస్తవులు, ముస్లింలు కూడ ప్రేమిస్తారని స్ప‌ష్టం చేశారు నాగ బాబు కొణిదెల‌. త‌ను మ‌త ఛాంద‌స‌వాది కాద‌ని హిందూ మ‌తాన్ని, ఆచారాల‌ను, సంస్కృతిని ప‌రిర‌క్షించాల‌ని మాత్ర‌మే కోరుతున్నాడ‌ని అన్నారు.

హిందు మత ధర్మ పరిరక్షణ లో ప‌వ‌న్ కళ్యాణ్ చేస్తున్న‌ పోరాటం క్రైస్తవుల మీద, ముస్లింల మీద కాదన్నారు. హిందు ధర్మం లో ఉంటూ హిందు ధర్మాన్ని చులకన చేస్తూ సెక్యులర్ వాదులం అని చెప్పుకునే సూడో సెక్యులర్ వాదులపై యుద్దం చేస్తున్నాడ‌ని అన్నారు కొణిదెల నాగ బాబు.