జన సైనికులు యుద్దం చేయాలి
పిలుపునిచ్చిన నాగ బాబు కొణిదెల
అమరావతి – రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, జగన్ మోహన్ రెడ్డి రాజా రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడంటూ నిప్పులు చెరిగారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి , ప్రముఖ నటుడు నాగ బాబు కొణిదెల. త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నీతికి, అవినీతికి మధ్య యుద్దం జరగ బోతోందన్నారు.
ఈసారి ఎన్నికల్లో జన సైనికులు , వీర మహిళలు కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని, వైసీపీని రాష్ట్రంలో లేకుండా చేయాలన్నారు. జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలంటే మనందరం అలుపెరుగని రీతిలో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు నాగ బాబు కొణిదెల.
ఈ రెండు నెలలు మనందరికీ అత్యంత క్లిష్టమైన సమయం అని హెచ్చరించారు. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సినిమాలు విడుదలైనప్పుడే మనం మెగా ఫ్యాన్స్ అని..మిగిలిన సమయంలో జన సైనికులమని స్పష్టం చేశారు నాగ బాబు.
రాష్ట్రంలో జనసేన..టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు తాతలు, తండ్రుల పేర్లు కాకుండా మహనీయుల పేర్లు పెడతామని చెప్పారు.