అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగ బాబు
అమరావతి – ప్రముఖ నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల కీలక వ్యాఖ్యలు చేశారు. తన వంతుగా ఇచ్చిన మాట ప్రకారం సాయం చేయడం జరిగిందని చెప్పారు. శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఆపరేషన్ వాలంటైన్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సందర్బంగా కీలక ప్రకటన చేశారు నాగ బాబు కొణిదెల. ఈ కార్యక్రమంలో ఎయిర్ ఫోర్స్ లో సేవలు అందిస్తూ ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు తన వంతుగా సాయం చేస్తానని మాటిచ్చారు.
ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా తన వంతుగా రూ. 6 లక్షలను అందజేశారు నాగ బాబు కొణిదెల. ఈ చిన్న సాయం పెద్దది కాక పోవచ్చని, కానీ ఇచ్చిన మాట మరిచి పోలేదన్న విషయాన్ని మరోసారి మీకు గుర్తు చేయాలని చెబుతున్నానని తెలిపారు.
కాగా తనకు దేశ సేవలో ప్రాణాలర్పించిన వారికి తోడ్పాటు అందించే అవకాశం రావడం చాల అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు నాగ బాబు కొణిదెల.