మోడీ మద్దతు మరిచి పోలేం
నాగ బాబు కొణిదెల కామెంట్స్
అమరావతి – ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లులు కురిపించారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి , ప్రముఖ నటుడు నాగబాబు కొణిదెల. గురువారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. తమకు సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు మోడీని ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏపీలో జరిగిన ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించేందుకు మోడీ అందించిన సహకారం, తోడ్పాటు అందించడాన్ని జీవితాంతం మరిచి పోలేమని తెలిపారు నాగ బాబు కొణిదెల. ఇదిలా ఉండగా ఊహించని విజయాన్ని కట్టబెట్టారు 5 కోట్ల మంది ప్రజలు.
తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన కూటమికి ఊహించని విజయం దక్కింది. 175 స్థానాలకు గాను వైసీపీకి కేవలం 11 స్థానాలు దక్కాయి. జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లోక్ సభ నియోజకవర్గాలు లభించాయి.
తాజాగా జరిగిన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.