సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా
ప్రకటించిన జనసేన ప్రధాన కార్యదర్శి
మంగళగిరి – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కీలక సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా హాజరైన జన సైనికులు, వీర మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్బంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అద్భుతమైన నాయకుడిని ఎన్నుకున్నారంటూ ప్రశంసించారు. ఇక నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామని ప్రకటించారు.
గత వైఎస్సార్సీపీ సర్కార్ వ్యవస్థలను అన్నింటిని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. నిర్వీర్యమై పోయిన వాటిని గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన నేతలు, కార్యకర్తలకు తగిన రీతిలో గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు నాగ బాబు.
తాగు నీటి సమస్య పరిష్కారానికి తాము తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. తీర ప్రాంతంలో చోటు చేసుకున్న కాలుష్యాన్ని నివారిస్తామన్నారు. మూడు నాలుగు రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పర్యటిస్తారని చెప్పారు.