స్పష్టం చేసిన నాగ బాబు కొణిదల
అమరావతి – రాష్ట్ర అభివృద్ది కోసం తన జీవితాన్ని అంకితం చేశాడంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి స్పష్టం చేశారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఎలాంటి స్వార్థం తెలియదన్నారు.
శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలంతా బాగుండాలని నిత్యం పరితపిస్తుంటాడని అన్నారు. వ్యక్తిగత రాగద్వేషాలకు దూరంగా ఉంటాడని పేర్కొన్నారు నాగ బాబు కొణిదల. తను ఎల్లప్పుడూ సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంత వరకైనా పోరాడుతాడని ప్రకటించారు.
మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంత వరకైనా వెళ్తాడని, అంతకు మించి పోరాడేందుకు సైతం వెనుకాడడని, ముందుకే వెళతాడని అన్నారు నాగ బాబు కొణిదెల. స్వార్థ ప్రయోజనాల కోసం ఢిల్లీకి తన సోదరుడు వెళ్ల లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లాడని , అందుకే పవన్ కళ్యాణ్ జన సేనాని అయ్యాడని స్పష్టం చేశారు .