తప్పుడు రాతలు రాస్తే ఊరుకోం
కొణిదెల నాగ బాబు స్ట్రాంగ్ వార్నింగ్
అమరావతి – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగ బాబు కొణిదెల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ – జనసేన – భారతీయ జనతా పార్టీ కూటమిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా లేదా నిరాధారమైన ఆరోపణలు చేసినా, స్పూర్తికి భంగం కలిగించేలా రాతలు రాస్తే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అలా కాదని తమ పనితీరు మార్చుకోమని అనుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇప్పటికే గత కొంత కాలంగా తమపై కక్ష కట్టి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, తప్పుడు రాతలు రాసిన వారు ఎవరో జాగ్రత్తగా గమనిస్తూ వచ్చామని చెప్పారు నాగబాబు. ఆయా వార్తలను గుర్తించి, ఎవరు దీనిని ప్రేరేపించారో, రాసిన వారిపై కూడా గుర్తు పెట్టుకుని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక నుంచి పద్దతి మానుకోవాలని, తమ కూటమికి ఢోకా లేదన్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా వైసీపీ నేతల్లో మార్పు రాక పోవడం దారుణమన్నారు. ఏది ఏమైనా జనసేన కూటమి ప్రభుత్వం ప్రజా పాలన అందజేసేందుకు కృషి చేస్తుందన్నారు నాగబాబు.