నాగ చైతన్య..శోబిత ధూళిపాళ నిశ్చితార్థం
ప్రకటించిన తండ్రి అక్కినేని నాగార్జున
హైదరాబాద్ – అక్కినేని నాగార్జున సంచలన ప్రకటన చేశారు. తన తనయుడు నాగ చైతన్య, శోభిత దూళిపాళతో గురువారం ఉదయం 9.42 నిమిషాలకు నిశ్చితార్థం జరిగిందని వెల్లడించారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా నాగ చైతన్య, శోభిత ధూళిపాళకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ ఇద్దరిని దీవించాలని కోరారు.
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఉంగరాలు మార్చుకున్నారని అక్కినేని నాగార్జున తెలిపారు. వీరిద్దరి నిశ్చితార్థం గురించి ప్రకటించడం తనకు ఆనందగా ఉందన్నారు. శోభిత ధూళిపాళను తమ కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు సంతోషంతో తామంతా ఉన్నామని పేర్కొన్నారు. వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని తాను, అమల కోరుకుంటున్నట్లు తెలిపారు నాగార్జున.
ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని నాగార్జున ఇంట్లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. భార్య అక్కినేని అమల, చైతన్య సోదరుడు అఖిల్, ధూళిపాళ తల్లిదండ్రులతో పాటు నిశ్చితార్థపు వేడుకకు హాజరైనట్లు సమాచారం.
కాగా 2021లో ప్రముఖ నటి సమంతతో పెళ్లి జరిగింది నాగ చైతన్యకు. కానీ వారిద్దరు విడి పోయినట్లు ప్రకటించారు. ఆతర్వాత శోభితతో చైతన్య డేటింగ్ లో ఉన్నారు. చివరకు ఉంగరాలు మార్చుకున్నారు.