కోడి కత్తి కేసుపై విచారణ చేపట్టండి
జనసేన ప్రధాన కార్యదర్శి నాగ బాబు
అమరావతి – కోడి కత్తి కేసు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగ బాబు కొణిదెల. మంగళవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
2019 కి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్ మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు నాగ బాబు కొణిదెల.
ఎందుకంటే 2019 లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేసాడని, 5 ఏళ్లు అయినా కూడా ఆ కేస్ ఇంకా కొలిక్కి రాలేదని పేర్కొన్నారు. అప్పుడంటే జగన్ మోహన్ రెడ్డికి బిజీ షెడ్యూల్ వల్ల కేసు విచారణ పూర్తి కాలేదన్నారు. ప్రస్తుతం ఆయన ఖాళీగానే ఉన్నారని, కూటమి సర్కార్ తక్షణమే విచారణ చేపట్టాలన్నారు.
జగన్ మోహన్ రెడ్డికి కోడి కత్తి కేసులో న్యాయం చేయాలని కోరారు నాగ బాబు కొణిదెల.