జనసేన ప్రధాన కార్యదర్శి
అమరావతి – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు , జనసేన పార్టీ చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. చాలా మంది తన తమ్ముడిని తక్కువగా అంచనా వేశారని అన్నారు.
కానీ ఎవరూ ఊహించని రీతిలో ఫీనిక్స్ పక్షిలాగా తానేమిటో, తన శక్తి ఏమిటో చూపించాడని కొనియాడారు. తన సోదరుడిని ఉప ముఖ్యమంత్రి హోదాలో చూడటం తనకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. సామర్థ్యం, అవగాహన కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు.
ఏపీ రాష్ట్రంలో చాలా సమస్యలు కొలువు తీరి ఉన్నాయని, వాటిని పరిష్కరించే సత్తా , దమ్మున్నోడు తన తమ్ముడని స్పష్టం చేశారు కొణిదెల నాగ బాబు. ఇదిలా ఉండగా తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు పవన్ కళ్యాణ్. ఆయన సచివాలయంలోని 2వ అంతస్తులో తనకు కేటాయించిన 211 ఛాంబర్ లో ఆసీనులయ్యారు.
ఈ సందర్బంగా తన సోదరుడు పవన్ ను ప్రత్యేకంగా అభినందించారు నాగ బాబు. ఆయన తో పాటు తెలంగాణ జనసేన పార్టీ చీఫ్ శంకర్ గౌడ్ కూడా ఉన్నారు.