ఎమ్మెల్సీ నాగబాబు కొణిదల కామెంట్
అమరావతి – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి , ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నాయకుడు కాదని , కేవలం సేవకుడిని మాత్రమేనని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ జయకేతనం ఆవిర్భావ సభలో ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ చాలా గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. తాను, తన సోదరుడు చిరంజీవి, కుటుంబం ఎవరూ ఊహించని రీతిలో అందనంత ఎత్తుకు ఎదిగాడని అన్నారు. వీలైతే పవన్ స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నం చేయాలన్నారు. లేదంటే అంత గొప్ప వ్యక్తికి సేవకుడిగా ఉండాలన్నారు. తాను పవన్ అంత ఎత్తుకు ఎదిగే సామర్థ్యం లేదని, అందుకే సేవకుడిగా ఉండి పోయానని చెప్పారు.
అనంతరం పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. రాజకీయాలను చాలా బలంగా దేశం కోసం చేస్తాం. ప్రజల శ్రేయస్సు కోసం చేస్తాం. రాజకీయాలు చేయాలంటే తెల్లగడ్డం వేసుకొని పుట్టక్కర్లేదన్నారు.. ముఖ్యమంత్రి కొడుకే అవ్వాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రమంత్రి మేనమామ కావాల్సిన అవసరం లేదన్నారు. బాబాయ్ ని చంపాల్సిన అవసరం అంతకంటే లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. నేను నిత్య విద్యార్థిని. జ్ఞాన సముపార్జన నిత్యం చేస్తూనే ఉంటాను. ఎన్నో థియరీలు, సిద్ధాంతాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులు, సమకాలీన అంశాలను ఎన్నో పుస్తకాలను చదివే నేను సిద్ధాంతాలను రూపొందించుకున్నానని చెప్పారు.