NEWSANDHRA PRADESH

య‌ల‌మంచిలోనే నా నివాసం

Share it with your family & friends

అన‌కాప‌ల్లి పోటీపై నో క్లారిటీ

అమ‌ర‌వాతి – జ‌న‌సేన పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు , న‌టుడు నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల కూట‌మి ఆధ్వ‌ర్యంలో ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

పార్టీకి సంబంధించిన నేత‌లు, శ్రేణులు మ‌రింత ఫోక‌స్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు నాగ‌బాబు. ప్ర‌స్తుతం తాను హైద‌రాబాద్ లో లేన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే తాను ఓట‌ర్ జాబితాలో త‌న పేరును కూడా మార్చుకున్న‌ట్లు చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. తాను రెండు చోట్ల ఓటు హ‌క్కు వినియోగించు కోవ‌డం లేద‌న్నారు.

ఉత్త‌రాంధ్ర‌లో పార్టీని బ‌లోపేతం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. త‌న శ‌క్తి వంచ‌న లేకుండా పాటు ప‌డ‌తాన‌ని అన్నారు. య‌ల‌మంచిలో శాశ్వ‌త నివాసం ఏర్పాటు చేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. కాగా తాను అన‌కాప‌ల్లి నుండి లోక్ స‌భ బ‌రిలో ఉండే విష‌యం మీద పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని, దానిపై ఇంకా తాను ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు నాగ బాబు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం నాగ బాబు చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.