జైనాబ్ తో అఖిల్ అక్కినేని నిశ్చితార్థం
ప్రకటించిన అక్కినేని నాగార్జున
హైదరాబాద్ – ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన సోషల్ మీడియా వేదికగా తన రెండో కుమారుడు అఖిల్ అక్కినేనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు. జైనాబ్ తో అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా వచ్చే నెల డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో శోభిత ధూళిపాలతో నాగ చైతన్య పెళ్లికి సిద్దం అవుతున్నారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి.
ఈ తరుణంలో అఖిల్ అక్కినేని గురించి సంతోషకరమైన వార్తను పంచుకున్నాడు. దీంతో అక్కినేని కుటుంబీకులు, అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే జైనాబ్ తో పెళ్లి పీటలు ఎక్క బోతున్నాడు అఖిల్ అక్కినేని. ప్రేమ పూర్వకమైన ఆశీర్వాదాలతో కుటుంబంలోకి సాదరంగా స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు అక్కినేని నాగార్జున, అమల దంపతులు.
ఇదిలా ఉండగా ఇన్‌స్టాగ్రామ్‌లో అఖిల్ తన అభిమానులతో సంతోషకరమైన క్షణాన్ని పంచుకున్నాడు, క్యాప్షన్‌తో చిత్రాన్ని పోస్ట్ చేశాడు – నాకు సరైన జోడి లభించింది. జైనాబ్ రావ్ జీతో నా బంధం మొదలవుతుందని చెప్పేందుకు సంతోషంగా ఉందన్నాడు.