ENTERTAINMENT

కొండా సురేఖ‌పై తాడో పేడో తేల్చుకుంటా

Share it with your family & friends

నిప్పులు చెరిగిన అక్కినేని నాగార్జున

విశాఖ‌ప‌ట్నం – ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నంలో ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ హ‌రిబాబును ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

తాజాగా మంత్రి చేసిన కామెంట్స్ వ్య‌వ‌హారంపై స్పందించారు. త‌న ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ను కూల్చ‌కుండా ఉండేందుకు కేటీఆర్ వ‌ద్ద‌కు ఒక్క రాత్రి స‌మంత రుత్ ప్ర‌భు వెళ్లాల‌ని అక్కినేని నాగార్జున , అమ‌ల ఫ్యామిలీ ఒత్తిడి చేసిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌. ఆమె చేసిన వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంప‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా ఏం చేయాల‌నే దానిపై ఆలోచిస్తామ‌న్నారు నాగార్జున‌.

కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని,. చట్టపరంగా పోరాడతానని హెచ్చ‌రించారు.