కొండా సురేఖ కామెంట్స్ నాగార్జున సీరియస్
మంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్దం
హైదరాబాద్ – ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చకుండా ఉండేందుకు కేటీఆర్ వద్దకు వెళ్లాలని అక్కినేని నాగార్జున ఫ్యామిలీ నటి సమంత రుత్ ప్రభుపై తీవ్ర వత్తిడికి గురి చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ రంగంలో అటు సినీ రంగంలో తీవ్ర కలకలం రేపాయి.
దీనిపై తీవ్రంగా స్పందించారు అక్కినేని నాగార్జున. ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకో వద్దంటూ హితవు పలికారు.
దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించాలని కోరారు. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధమని పేర్కొన్నారు అక్కినేని నాగార్జున. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నానని తెలిపారు.