దురుద్దేశ పూర్వకంగానే కొండా సురేఖ కామెంట్స్
నాంపల్లి కోర్టులో నాగార్జున కీలక వాంగ్మూలం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున. గత ప్రభుత్వ హయాంలో తనకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చి వేయకుండా ఉండేందుకు నటి సమంతను తన వద్దకు వెళ్లాలని తాము ఒత్తిడి చేసినట్లు కొండా సురేఖ చేసిన కామెంట్స్ దారుణమన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు.
ఈ మేరకు తాను కోర్టులో పరువు నష్టం కింద దావా వేసినట్లు చెప్పారు నాగార్జున. మంగళవారం ఇదే కేసుకు సంబంధించి నిన్న విచారణ కొనసాగింది. ఇవాళ నాగార్జున తన కుటుంబంతో సహా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.
ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తమ కుటుంబం మానసికంగా క్షోభకు గురైందని వాపోయారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు నాగార్జున. రాజకీయ దురుద్దేశంతోనే తమపై ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు నాగార్జున.
ఆమె కామెంట్స్ వల్ల తమ పరువుకు భంగం కలిగిందని వాపోయారు. జాతీయ స్థాయిలో తమకు ఎన్నో పురస్కారాలు వచ్చాయని తెలిపారు. తమ కొడుకు విడాకులు కేవలం కేటీఆర్ వల్లే అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.