NEWSTELANGANA

నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు వ‌ర‌ద ఉధృతి

Share it with your family & friends

భారీగా కురుస్తున్న వ‌ర్షాల తాకిడి

న‌ల్ల‌గొండ జిల్లా – ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఏర్ప‌డిన అల్ప పీడ‌నం వాయుగుండంగా మార‌డంతో భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు త‌మిళ‌నాడు త‌ల్ల‌డిల్లుతోంది. ఇంకో వైపు ఏపీలో ఇప్ప‌టికే వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక క‌ర్ణాట‌క‌ను వ‌ర్షాలు ముంచెత్తాయి. దీంతో ఎగువ నుంచి భారీ ఎత్తున నీరు వ‌చ్చి చేరుతోంది ప్రాజెక్టుల‌కు.

గురువారం తెలంగాణ రాష్ట్రంలోని న‌ల్ల‌గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు మ‌రోసారి వ‌ర‌ద వ‌చ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు ముందు జాగ్ర‌త్త‌గా 4 గేట్లు ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేశారు.

మొత్తం 32,360 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 76,656 క్యూసెక్టులు ఉండ‌గా పూర్తి స్థాయి నీటి మ‌ట్టం 590 అడుగులు ఉంది. ప్ర‌స్తుత ప్రాజెక్టు నీటి మ‌ట్టం 589.90 అడుగులు ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు.
ఇక పూర్తి స్థాయి నీటి మ‌ట్టం 312 టీఎంసీలు కాగా ప్ర‌స్తుత నీటి నిల్వ 311. 7462 టీఎంసీలుగా ఉంది.