TELANGANANEWS

ఓటు వేసిన బీజేపీ అభ్య‌ర్థి భ‌ర‌త్

Share it with your family & friends

అచ్చంపేట‌లో తండ్రితో పాటు త‌ను కూడా

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా – నాగ‌ర్ క‌ర్నూల్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థి పోతుగంటి భ‌ర‌త్ కుమార్ తో పాటు సిట్టింగ్ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు సోమ‌వారం కుటుంబ స‌మేతంగా జిల్లా లోని అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. మ‌ధ్యాహ్నం ప‌ట్ట‌ణంలోని 103వ పోలింగ్ బూత్ లో వారు ఓటు వేశారు.

ఎంపీ అభ్య‌ర్థి భ‌ర‌త్ కుటుంబీకుల‌తో పాటు అచ్చంపేట ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ప‌లుస గోపాల్ యాద‌వ్ కూడా ఓటు వేసిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండ‌గా నాగ‌ర్ క‌ర్నూల్ లో ట‌ఫ్ ఫైట్ న‌డుస్తోంది. మ‌రో వైపు కోడ్ ఉల్లంఘించారంటూ బీజేపీ అభ్య‌ర్థిపై బీఆర్ఎస్ నేత ఆరోపించారు. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ కు ఫిర్యాదు చేశారు.

దీనిపై ఎంపీ అభ్య‌ర్థి భ‌ర‌త్ కుమార్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇదిలా ఉండ‌గా నాగ‌ర్ క‌ర్నూల్ పార్ల‌మెంట్ స్థానం ఎస్సీ రిజ‌ర్వ్ డ్. ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి మ‌ల్లు ర‌వి, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ బ‌రిలో ఉన్నారు.