ENTERTAINMENT

నాగార్జున కేసు రేప‌టికి వాయిదా

Share it with your family & friends

కోర్టుకు హాజ‌రు కానునున్న న‌టుడు

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై ప‌రువు న‌ష్టం దాఖ‌లు చేశారు ప్ర‌ముఖ న‌టుడు , బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున‌. ఈ కేసుకు సంబంధించి సోమ‌వారం హైద‌రాబాద్ లోని నాంప‌ల్లి కోర్టులో విచార‌ణ జ‌రిగింది. వాదోప వాద‌న‌లు కొన‌సాగాయి.

అయితే అక్కినేని నాగార్జున‌తో పాటు ఇత‌ర సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేయాల‌ని న్యాయ‌వాది జ‌డ్జిని కోరారు. దీనికి సంబంధించి కోర్టుకు మంగ‌ళ‌వారం హాజ‌రు కావాల‌ని ఆదేశించింది కోర్టు.

దీంతో ఈ కేసును అక్టోబ‌ర్ 8వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు జ‌డ్జి. ఇదిలా ఉండ‌గా న‌టుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌. ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.

ఇదే స‌మ‌యంలో నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ను అక్ర‌మంగా నిర్మించారంటూ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదైంది. దీంతో ఇటు స‌ర్కార్ అటు నాగార్జున మ‌ధ్య వార్ మొద‌లైంది. కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీపై చేసిన దారుణ‌మైన కామెంట్స్ ను ఖండించారు సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు.