అల్లు అర్జున్ కేసు విచారణ వాయిదా
ఈనెల 30న తిరిగి విచారించనున్న కోర్టు
హైదరాబాద్ – సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కాగా కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు కొంత సమయం కావాలని కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. దీంతో తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది కోర్టు.
భద్రతా కారణాల రీత్యా తాను హాజరు కాలేనని, వర్చువల్ గా హాజరవుతానని కోర్టుకు విన్నవించారు నటుడు అల్లు అర్జున్ . దీనికి కోర్టు సమ్మతించింది. ఇదిలా ఉండగా ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు బన్నీకి తలనొప్పిగా పరిణమించాయి.
చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను కేసుకు సంబంధించి ఏసీపీ విచారణ చేపట్టారు. ఒక రోజు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆ తర్వాత శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై నిప్పులు చెరిగారు. చిక్కడపల్లి ఘటనకు పూర్తి బాధ్యత బన్నీనే కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ తరుణంలో టాలీవుడ్ ప్రముఖులు టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సీఎంను కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.