అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్
బిగ్ షాక్ ఇచ్చిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. అరెస్ట్ చేసిన అల్లు అర్జున్ కు ముందుగా ఉస్మానియా ఆస్పత్రిలో పరీక్షలు చేపట్టారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్బంగా కీలక వాదనలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అక్కడి నుంచి చంచల్ గూడకు తరలించారు.
పుష్ప-2 మూవీ రిలీజ్ సందర్బంగా ప్రీమియర్ షో నిర్వహించారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. అల్లు అర్జున్ రాక సందర్భంగా పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకుంది. బన్నీకి సంబంధించిన వ్యక్తిగత సెక్యూరిటీతో పాటు బౌన్సర్ల అత్యుత్సాహం కొంప ముంచేలా చేసింది.
తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చని పోయింది. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. రష్మిక మందన్నా కు పర్మిషన్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఈ మొత్తం ఘటనకు సంధ్య థియేటర్ యజమానితో పాటు నటుడు అల్లు అర్జున్ కు కూడా పాత్ర ఉందంటూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.