తనకు బెయిల్ ఇవ్వద్దంటూ విన్నపం
హైదరాబాద్ – సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తను డబ్బు, పలుకుబడి కలిగిన వ్యక్తి అని, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. విచారణకు సహకరించక పోవడం వల్లనే తాము బన్నీని అరెస్ట్ చేయడం జరిగందన్నారు. బెయిల్ ఇస్తే సహకరించక పోవచ్చన్నారు.
ఇదిలా ఉండగా థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా తనయుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ కేసులో బన్నీని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది.
తన అరెస్ట్ అక్రమం అంటూ హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్. దీనిపై విచారించిన కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి భద్రతా కారణాల రీత్యా తాను ప్రత్యక్షంగా విచారణకు హాజరు కాలేనని, వర్చువల్ గా హాజరవుతానని తెలిపారు . దీనిని సవాల్ చేస్తూ పోలీసులు బెయిల్ ఇవ్వవద్దంటూ కోరారు.