సీఎం సహాయ నిధికి బాలకృష్ణ విరాళం
రేవంత్ రెడ్డికి అందించిన బాలకృష్ణ కూతురు
హైదరాబాద్ – తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం చోటు చేసుకుంది. దీంతో పలువురు ప్రముఖులు తమ వంతు బాధ్యతగా విరాళాలను ప్రకటించారు. గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు విరాళంగా అందించారు ప్రముఖ నటుడు, హిందూపురం టీటీడీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూతురు.
ఆయన తరపున కూతురు తేజస్విని సీఎం ఎ. రేవంత్ రెడ్డిని కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఆముదాలపాడు జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు.
అంతకు ముందు ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ. ఒక కోటిని విరాళంగా అందించారు. సీఎం నివాసంలో కలుసుకుని చెక్కును అందజేశారు. ఇదే సమయంలో సినీ రంగానికి చెందిన నటీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు తమ వంతు బాధ్యతగా విరాళాలు ప్రకటించారు.
ఇదిలా ఉండగా తమ వంతు బాధ్యతగా సాయం చేసిన నటుడు నందమూరి బాలకృష్ణను, ఆయన కూతురును అభినందించారు అనుముల రేవంత్ రెడ్డి.