సీఎం సతీమణి నారా భువనేశ్వరి
అమరావతి – సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికి ఆర్థిక అక్షరాస్యతతో పాటు డిజిటల్ సాంకేతికత పట్ల నైపుణ్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు. సమాజంలో తమ వృత్తుల్లో ఆరితేరిన నిపుణులు సైతం సైబర్ నేరగాళ్ల దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సైబర్ నేరగాళ్లు ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో మనకు తెలిసే అవకాశం ఉండదన్నారు. వాళ్లకు రూపు రేఖలే కాదు, హృదయంలో ఏమాత్రం దయ అన్నది ఉండదన్నారు. అందుకని ప్రతి ఒక్కరికీ డిజిటల్ సాంకేతికతపై అవగాహన, పర్యవేక్షణ ఉండాలన్నారు.
భారత వాణిజ్య రంగంలో రాణిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలను చూసి నేను నిజంగా గర్వపడుతున్నానని అన్నారు నారా భువనేశ్వరి. గ్రీన్ ఫైనాన్సింగ్ ,డిజిటల్ ఇంక్లూజన్, ఎథికల్ ఏఐ వీటన్నిటి తోడ్పాటుతో మనం ఆర్థిక లోటును భర్తీ చేసుకోవచ్చని అన్నారు. చిన్న తరహా పరిశ్రమలను ఇతోధికంగా స్థాపించి అసంఖ్యాకమైన ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని తెలిపారు. .తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు నారా భువనేశ్వరి.
మహిళల ఆర్థికాభివృద్ధికి, సంపద సృష్టికి పరిశ్రమల స్థాపన ఎంతో కీలకం అన్నారు..రమాదేవి ఆమె టీం సభ్యులందరూ ఎలీప్ ద్వారా అనేక మంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారని కొనియాడారు.