నారా భువనేశ్వరి కామెంట్స్
చిత్తూరు జిల్లా – గత ప్రభుత్వ విధ్వంస పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని, రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పులు మన నెత్తిన వేసి వెళ్లారని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం కుప్పం నియోజకవర్గంలోని అడవిబూదుగూరులో పర్యటించారు. పేదరికం లేని సమాజం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. తన పాలనా సామర్థ్యంతో ఏపీని ముందుకు తీసుకు వెళతారని అన్నారు.
గడిచిన ఐదేళ్లలో రాక్షస పాలనలో టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన చెందారు. పల్నాడులో చంద్రయ్యను అన్యాయంగా చంపేశారని అన్నారు. కార్యకర్తల త్యాగాలు వెల కట్టలేనివని అన్నారు.
కష్టకాలంలోనూ చంద్రబాబు పైన నమ్మకం పెట్టుకుని ఆయన చెయ్యి వదలకుండా పనిచేశారని కితాబు ఇచ్చారు . కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు నారా భువనేశ్వరి. చంద్రబాబు నాయుడును ఏకంగా కుప్పం ప్రజలు ఎనిమిదిసార్లు గెలిపించారని వారి రుణం తీర్చుకుంటామన్నారు.