NEWSANDHRA PRADESH

హెరిటేజ్ ఔదార్యం రూ. 2 కోట్ల విరాళం

Share it with your family & friends

ఏపీ..తెలంగాణ రాష్ట్రాల‌కు చెరో కోటి

అమ‌రావ‌తి – భారీ వ‌ర్షాల తాకిడికి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ‌, ఆంధ‌ప్ర‌దేశ్ అత‌లాకుత‌లం అయ్యాయి. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు త‌మ వంతుగా సాయం చేస్తున్నారు. ఇప్ప‌టికే సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ న‌టులు , ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, సాంకేతిక నిపుణులు , వ్యాపార‌వేత్త‌లు విరాళం ప్ర‌క‌టించారు.

మెగాస్టార్ చిరంజీవి, బాల‌కృష్ణ‌, మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్ రూ. 50 ల‌క్ష‌ల చొప్పున ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల నిధికి రూ. కోటి విరాళంగా ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి రూ. 2 కోట్లు విరాళంగా ప్ర‌క‌టించారు. తెలంగాణ సీఎం నిధికి రూ. కోటి, ఏపీ సీఎం నిధికి మ‌రో రూ. కోటి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కాగా నారా భువ‌నేశ్వ‌రి ప్ర‌స్తుతం హెరిటేజ్ ఫుడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ వంతు బాధ్య‌త‌గా సాయాన్ని ప్ర‌క‌టిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు . బుధ‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో చిక్కుకు పోయిన బాధితులు సుర‌క్షితంగా చేరుకోవాల‌ని, ఆ దేవుడు ఇరు రాష్ట్రాలను వ‌ర్షాల నుంచి కాపాడాల‌ని ఆమె కోరారు.