NEWSANDHRA PRADESH

చితికి పోయిన నేత‌న్న‌ల‌ను ఆదుకుందాం

Share it with your family & friends

పిలుపునిచ్చిన నారా భువ‌నేశ్వ‌రి

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో కీల‌క‌మైన పండుగ‌లు రాబోతున్నాయి. ఈ సంద‌ర్బంగా చేనేత‌ల‌కు తీపి క‌బురు చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రు చేనేత వ‌స్త్రాల‌ను ధ‌రించాల‌ని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్బంగా నేత‌న్న‌ల‌ను ఆదుకునేందుకు ముందుకు రావాల‌ని కోరారు ఆమె.

ఆదివారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా వీడియో సందేశం ఇచ్చారు. చేనేతలకు అండగా నిలబడాల‌ని కోరారు. ఒంట్లో నరాలను దారాలుగా పోగు చేసి కష్టపడి..రక్తంతో రంగులు అద్దుతూ చెమటోడ్చే చేనేతల బతుకు చిత్రం మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

రాబోయే రోజుల్లో వరుస పండుగల నేపథ్యంలో మన సంస్కృతి, సంప్రదాయాలను చాటే వస్త్రాలను ధరించడంతో పాటు చేనేతల కళా రూపాలకు పెద్దపీట వేయాలని కోరారు నారా భువ‌నేశ్వ‌రి. మన కుటుంబంతో పాటు మన ఇంట్లో ఆనందంగా పండుగ చేసుకోవడంతో పాటు చేనేత వస్త్రాలపై ఆధారపడి బతికే అందరి ఇళ్లల్లో పండుగ సంతోషం నింపాలని అన్నారు.