కూటమి ప్రభుత్వంతో వెలుగొచ్చింది
కుప్పం ప్రజలతో నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి గురువారం కుప్పం నియోజకవర్గ ప్రజలతో ముఖాముఖి చేపట్టారు. వైసీపీ ఐదేళ్ల పరిపాలన కాలంలో రాష్ట్రం చీకటిలో మగ్గి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
2024లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వంతో రాష్ట్రంలో వెలుగు వచ్చిందని అన్నారు నారా భువనేశ్వరి. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఇవాళ మూడో రోజు రామకుప్పం గ్రామంలో పర్యటించారు.
పల్లెకు చెందిన మహిళలతో ముఖాముఖి చేపట్టారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు నారా భువనేశ్వరి. మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని తమ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. మహిళా సంఘాలకు భారీ ఎత్తున నిధులను మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ది చెందడంలో మహిళలదే కీలకమైన పాత్ర అని పేర్కొన్నారు. అన్ని రంగాలలో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని చెప్పారు నారా భువనేశ్వరి. తాము ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారని చెప్పారు.