బాబు పాలన భేష్ – భువనేశ్వరి
భువనేశ్వరి సంతోషం
అమరావతి – నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకున్నట్టుగానే ప్రజా పాలన చంద్రబాబు సారథ్యంలో ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇక నుంచి రాష్ట్రానికి అంతా మంచే జరుగుతుందని తెలిపారు.
మంగళవారం నారా భువనేశ్వరి ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తన ఆనందాన్ని పంచుకున్నారు.
నాడు నిజం గెలవాలి కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశాను…బాధలు విన్నాను…ఇబ్బందులు తెలుసుకున్నాను. అణచివేతను అర్థం చేసుకున్నాను. నేను కోరుకున్నట్లుగానే అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజా పాలన మొదలైందన్నారు.
ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచామన్నంత సంతోషంలో ఉన్నారని తెలిపారు. స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. తమ అభిప్రాయాలు చెప్పగలుగుతున్నారని పేర్కొన్నారు నారా భువనేశ్వరి.
నాడు జరిగిన అన్యాయాలను నిర్భయంగా ప్రస్తావిస్తూ…తాము పడిన క్షోభపై గళం విప్పుతున్నారని, నాడు అశాంతితో బతికిన ప్రజల మనసులు నేడు తేలిక పడ్డాయన్నారు. మహిళలు తమ రక్షణపై, తల్లులు తమ బిడ్డల భవిష్యత్తు పై ధైర్యంగా ఉన్నారని తెలిపారు.