మోడీ ఆశీర్వాదం బ్రాహ్మణి సంతోషం
ప్రధానమంత్రికి నారా కుటుంబం థ్యాంక్స్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసి..నూతన ప్రభుత్వానికి మద్దతు తెలపడమే కాకుండా ఆశీర్వదించిన ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
అత్త, కోడలు ట్విట్టర్ వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఆద్యంతమూ నరేంద్ర మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. మోడీ రాకతో తమ కుటుంబం మరింత సంతోషానికి లోనైందని తెలిపారు.
తమ కుటుంబానికి మరపురాని రోజుగా మిగిలి పోతుందని, ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని స్పష్టం చేశారు అత్తా కోడళ్లు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సాయంత్రం నేరుగా తిరుమలకు బయలుదేరి వెళ్లారు కుటుంబ సమేతంగా .
కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు.