శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఇంటిల్లిపాదికి ఉండాలి
హెరిటేజ్ ఎండీ..నారా లోకేష్ భార్య బ్రాహ్మణి
అమరావతి – దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభవేళ మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు నారా లోకేష్ సతీమణి , హెరిటేజ్ ఎండీ నారా బ్రాహ్మణి.
సోమవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ ఇంటిల్లిపాదికీ శ్రీకృష్ణుని ఆశీస్సులు, అండ ఉండాలని… మీరు తలపెట్టిన ప్రతి పని ఆ భగవానుని తోడుతో విజయవంతంగా పూర్తికావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రీకృష్ణుడి గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. ఆయన ప్రవచించిన గీతోపదేశం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రభావితం అయ్యారని..ఇంకా గీతను ప్రేమిస్తూనే ఉన్నారని కొనియాడారు నారా బ్రాహ్మణి.
జీవితంలో ఏదైనా ఒక పని మొదలు పెట్టాలన్నప్పుడు మనసులో ఎన్నో సందేహాలు వచ్చి అడుగు ముందుకు పడదన్నారు. అలాంటి సమయంలో మనల్ని ముందడుగు వేయించే స్ఫూర్తిని భగవద్గీత అందిస్తుందని ప్రశంసలు కురిపించారు.