అభివృద్ది కోసం పని చేద్దాం
పిలుపునిచ్చిన నారా బ్రాహ్మణి
మంగళగిరి – ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మంగళగిరిలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి మంత్రి నారా లోకేష్ తో పాటు నారా బ్రాహ్మణి హాజరయ్యారు.
పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని తామిద్దరం కలిసి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు నారా బ్రాహ్మణి.
అంతకు ముందు శ్రీ భద్రావతి సమేత భావనా రుషి స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికారు. పూజారాలు లోకేష్, బ్రాహ్మణిని అశీర్వదించారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నియోజకవర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేద్దామని పిలుపు ఇచ్చారు.
ప్రస్తుతం కొలువు తీరిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే టాప్ లో నిలిచేలా చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్.