స్వామీ సదా స్మరామీ
నారా బ్రాహ్మణి..లోకేష్
తిరుమల – ఏపీ సీఎంగా కొలువు తీరిన నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా టీటీడీ ఈవో వీర బ్రహ్మం వారికి సాదర స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. చిత్ర పటాన్ని బహూకరించారు సీఎం కుటుంబానికి .
తమ కుటుంబ ఇలవేల్పు అయిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కోవడం ఆనందంగా ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు కోడలు , హెరిటేజ్ ఎండీ నారా బ్రాహ్మణి. చెప్పలేనంత సంతోషానికి లోనయ్యానని పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా ఏడు కొండలపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని, ఇదంతా ఆ స్వామి వారి చలవేనని అన్నారు నారా బ్రాహ్మణి. తమకు అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టినందుకు ప్రజలకు, తిరుమలకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని తెలిపారు బ్రాహ్మణి.