చంద్రబాబు మార్గం శిరోధార్యం
ఆయన విజన్ ఉన్న నాయకుడు
మంగళగిరి – చంద్రబాబు నాయుడు అరుదైన నాయకుడని పేర్కొన్నారు కోడలు , హెరిటేజ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి. శనివారం చంద్రబాబు పుట్టిన రోజు సందర్బంగా ఆమె పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ దేశంలో ఉన్న అతి కొద్ది మంది విజన్ కలిగిన నేతలలో చంద్రబాబు ఒకరని స్పష్టం చేశారు. ఆయన చూపిన మార్గం తనకు శిరోధార్యమని పేర్కొన్నారు. పనిని ఎక్కువగా ప్రేమిస్తారని, ప్రతి చోటా , ప్రతి నిమిషం చంద్రబాబు నాయుడు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారని తెలిపారు.
ఆయనను చూసి తాను చాలా నేర్చు కోవడం జరిగిందని పేర్కొన్నారు. ఇవాళ ఈ దేశంలో ఐటీ రంగం ప్రాధాన్యతను గుర్తించిన తొలి ముఖ్యమంత్రి తన మామ చంద్రబాబేనన్న విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. లేక పోయి ఉంటే ఐటీ ఇంతగా పాపులర్ అయ్యేది కాదన్నారు నారా బ్రాహ్మణి.
ఈ తరానికే కాదు వచ్చే తరానికి కూడా చంద్రబాబు నాయుడు ఆదర్శ వంతమైన , సమర్థవంతమైన నాయకుడిగా ఉండి పోతారని స్పష్టం చేశారు.