దుర్గాష్టమి శుభాకాంక్షలు – నారా బ్రాహ్మణి
తెలుగు వారంతా బాగుండాలి
అమరావతి – విజయ దశమి పండుగను పురస్కరించుకుని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి , హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో నారా బ్రాహ్మణి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా బాగుండాలని, సుఖ సంతోషాలతో ఆయు రారోగ్యాలతో ఉండాలని కోరారు .
ఈ దసరా పండుగ మీ కుటుంబాలకు సకల శుభాలను చేకూర్చాలని, ఇంటింటా సిరి సంపదలతో ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నానని తెలిపారు నారా బ్రాహ్మణి.
ప్రజలంతా సుఖ శాంతులతో వర్థిల్లేలా చూడాలని ఇంద్ర కీలాద్రిపై కొలువు తీరిన కనక దుర్గమ్మ అమ్మ వారిని వేడుకుంటున్నానని కోరుకున్నట్లు తెలిపారు. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే దసరా పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాని అన్నారు నారా బ్రాహ్మణి.
దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలిసి మెలిసి జీవించాలన్నదే దసరా పండుగ సందేశమన్నారు. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధి కారక సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.