NEWSANDHRA PRADESH

చేనేత కార్మికుల‌కు బ్రాహ్మ‌ణి భ‌రోసా

Share it with your family & friends

మంగ‌ళ‌గిరిలో వీర్ శాల ప్రారంభం

మంగ‌ళ‌గిరి – చేనేత కార్మికుల‌కు భ‌రోసా ఇచ్చేందుకు వీర్ శాల ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు హెరిటేజ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ నారా బ్రాహ్మణి. అమ‌రావ‌తి రాష్ట్రంలోని మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న భ‌ర్త‌, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ దీనిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. ఈ సంద‌ర్బంగా చేనేత కార్మికుల‌కు ఉపాధి క‌ల్పించి భ‌రోసా క‌ల్పించేందుకు గాను వీర్ శాల‌ను ఏర్పాటు చేశారు. దీనిని హాయ్ సిఇఓ త‌నీరా అంబుజ్ నారాయ‌ణ్ తో పాటు నారా బ్రాహ్మణి ప్రారంభించారు.

ఈ సంద‌ర్బంగా నారా బ్రాహ్మ‌ణి ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు.
ఈ చొరవ చేనేత కార్మికులకు నైపుణ్యం పెంచే అవకాశాలను అందించడం జ‌రుగుతుంద‌న్నారు. వారి నైపుణ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడే సాంకేతికతకు కూడా ఊతం ఇవ్వ‌డం శుభ ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు నారా బ్రాహ్మ‌ణి.

ప్ర‌ధానంగా చేనేత కార్మికుల‌కు భ‌రోసా క‌ల్పించ‌డం , వారిని ప్ర‌పంచంతో పోటీ ప‌డేలా చేయ‌డం ముఖ్య ఉద్దేశ‌మ‌న్నారు . ఇది నిజంగా అంతర్జాతీయ గుర్తింపున‌కు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు. నేత కార్మికులను చైతన్య పరచడానికి, గర్వించదగిన వారసత్వాన్ని కాపాడు కోవడానికి తాము కట్టుబడి ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు.