మంగళగిరి చీరలకు గుర్తింపు
పిలుపునిచ్చిన బ్రాహ్మణి నారా
హైదరాబాద్ – ప్రతి రంగంలో మహిళలు కీలకమైన పాత్ర పోషిస్తున్నా ఆశించిన అభివృద్ది సాధించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు హెరిటేజ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి .
నెక్లెస్ రోడ్ లో తనీరా ఆధ్వర్యంలో శారీ రన్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ప్రకాశవంతమైన, కళాత్మకంగా నేసిన చీరల్లో మహిళలు ధరించి మెరిసి పోతున్నారని ప్రశంసలు కురిపించారు బ్రాహ్మణి నారా. ఈ సందర్బంగా ఆత్మ విశ్వాసంతో కలిసిన వేలాది మంది మహిళలను ఈ సందర్బంగా కలుసు కోవడం ఆనందంగా ఉందన్నారు.
ఆరుగాలం కష్టపడి పని చేసే మహిళలు ప్రేమతో చేతితో నేసిన ప్రామాణికమైన మంగళగిరి చీరలను ధరించడం అంటే తనకు ఎంతో ఇష్టమని స్పష్టం చేశారు నారా బ్రాహ్మణి. ఏపీలోనే కాదు తెలంగాణతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో మంగళగిరి చీరలకు ఎంతో ప్రాధాన్యత, గుర్తింపు ఉందన్నారు.