స్వామి సన్నిధిలో బ్రాహ్మణి..లోకేష్
శ్రీలక్ష్మీ నరసింహుడి ఆలయంలో పూజలు
అమరావతి – రాష్ట్రంలో ఆశించిన దాని కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. దీంతో భారీ మెజారిటీతో తనను గెలిపించినందుకు సంతోషం వ్యక్తం చేశారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . ఈ సందర్బంగా ఆయన మంగళగిరిలో తన భార్య నారా బ్రాహ్మణితో కలిసి తాము నమ్ముకున్న , ప్రముఖ పేరు పొందిన శ్రీలక్ష్మి నరసింహ్మ స్వామి ఆలయానికి చేరుకున్నారు.
ఈ సందర్బంగా స్వామి వారిని దర్శించుకున్నారు నారా బ్రాహ్మణి, నారా లోకేష్ బాబు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు సాదర స్వాగతం పలికారు ఈ ఇద్దరికీ. పూజలు చేసిన అనంతరం దంపతులకు ప్రసాదంతో పాటు చిత్ర పటాన్ని అందజేశారు పాలక మండలి సభ్యులు.
ఈ సందర్బంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. శ్రీలక్ష్మీ నరసింహుడిని నమ్ము కోవడం వల్ల తమకు మేలు జరిగిందని చెప్పారు. ఆయన ఆశీర్వాద బలం వల్లనే తమ పార్టీ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందని స్పష్టం చేశారు. మొత్తంగా అరాచక పాలనకు జనం స్వస్తి పలికారని పేర్కొన్నారు.