లోకేష్ కు సమస్యల వెల్లువ
ప్రజా దర్బార్ కు పోటెత్తారు
అమరావతి – ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ప్రారంభించిన ప్రజా దర్భార్ కు ప్రజలు పోటెత్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. దీంతో లోకేష్ చాలా ఓపికగా వారి వినతలు స్వీకరిస్తూ అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మంత్రిగా కొలువు తీరిన వెంటనే ప్రజలతో ముఖాముఖి నిర్వహించాలని నిర్ణయించారు. ఆయన తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇందులో భాగంగానే ప్రజా దర్బార్ కు శ్రీకారం చుట్టారు. మంగళగిరి నియోజకవర్గం నుండే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు రావడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు నారా లోకేష్.
ప్రతిఒక్కరి సమస్యను ఓపిగ్గా వింటూనే, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఆయా శాఖలకు రిఫర్ చేసి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ డబ్ల్యూఆర్ స్కూల్, కాలేజీల్లో పని చేస్తున్న పార్ట్ టైం సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని సిబ్బంది కోరారు.