జగన్ మాయలోడు జాగ్రత్త
నారా లోకేష్ కామెంట్స్
మంగళగిరి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మాయ లోడు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండక పోతే రేపు ఏపీని తాకట్టు పెడతాడని హెచ్చరించారు. ఓటు అన్నది విలువైనదని, అది పని చేసే వారికి మాత్రమే వేయాలని కోరారు. నవ రత్నాల పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టాడని ఆరోపించారు.
జగన్ ను జనం నమ్మే స్థితిలో లేరన్నారు. ఆయనను ఇంటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నారని, టీడీపీ జనసేన కూటమి పవర్ లోకి రావడం పక్కా అని జోష్యం చెప్పారు. 2019లో వచ్చాడు..మెగా డీఎస్సీ చేపడతానని చెప్పాడని, రెండున్నర లక్షల జాబ్స్ ఇస్తానని నమ్మించాడని ధ్వజమెత్తారు.
కానీ అధికారంలోకి వచ్చాక కనీసం 10 వేల పోస్టులు కూడా భర్తీ చేయలేక పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్.