రాక్షసులుగా మారిన వైసీపీ నేతలు
నిప్పులు చెరిగిన నారా లోకేష్ బాబు
మంగళగిరి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలింగ్ ముగిసినా ఇంకా పలు చోట్ల దాడులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అప్రజాస్వమికమని పేర్కొన్నారు.
అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు రాక్షసులుగా మారారని ఆరోపించారు. దాడులకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్ ఓటమి భయంతో వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తిస్తున్నారంటూ వాపోయారు.
టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో తిరుపతి జిల్లా లోని పెళ్లకూరుమిట్టకు చెందిన మహిళపై గర్భిణి అని చూడకుండా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చినట్లు ఓటు వేసే స్వేచ్ఛ లేకుండా చేసిన వైసీపీకి పతనం ఖాయమని స్పష్టం చేశారు నారా లోకేష్.
గర్భిణికి మెరుగైన వైద్యం అందించి నిందితులను అరెస్టు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. జగన్ రెడ్డికి మూడిందని, ఆయన ఇంటికి వెళ్లడం తప్పదన్నారు. అందుకే ముందస్తుగానే విదేశాలకు వెళుతున్నాడని ఆరోపించారు నారా లోకేష్.