జోరుగా బుడమేరు గండి పూడ్చివేత పనులు
స్వయంగా పరిశీలించిన నారా లోకేష్, నిమ్మల
విజయవాడ – భారీ వర్షాలు, వరదల దెబ్బకు విజయవాడలోని బుడమేరుకు భారీ ఎత్తున గండి పడింది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలకు దిగింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన మంత్రులు, ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తూ పరిస్థితిని చక్క దిద్దే ప్రయత్నం చేస్తున్నారు సీఎం.
ఇదిలా ఉండగా శనివారం సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీ మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు బుడమేరుకు పడిన గండి వద్దనే ఉన్నారు. గండి పూడ్చివేత పనులను పరిశీలించారు.
. వివిధ శాఖలు సమన్వయం చేసుకుని పని చేయడంతో మూడో గండి పూడ్చివేత దాదాపు పూర్తయిందన్నారు ఈ సందర్బంగా మంత్రులు. గట్టు పటిష్టత పనులు కూడా వేగంగా పూర్తి చేయాలని సూచించడం జరిగిందన్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.