Saturday, April 5, 2025
HomeNEWSANDHRA PRADESHయూనివ‌ర్శిటీల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తాం

యూనివ‌ర్శిటీల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తాం

ప్ర‌క‌టించిన మంత్రి నారా లోకేష్

అమ‌రావ‌తి – విశ్వ విద్యాలయాలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సాంకేతిక విశ్వ విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, ఉద్యోగుల వివరాలు, ఖాళీల భర్తీ, యూనివర్సిటీల అభివృద్ధిపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది లోనే ఖాళీల‌ను పూర్తి చేస్తామ‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. రీసెర్చ్ , ఇన్నోవేష‌న్ పై ఫోక‌స్ పెడ‌తామ‌న్నారు. అంతే కాకుండా డీఎస్సీ నోటిఫికేష‌న్ రిలీజ్ చేస్తామ‌న్నారు.

విశ్వ విద్యాలయాలకు వస్తే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో మనం 9వ స్థానంలో ఉన్నామ‌న్నారు. పీహెచ్ డీ విద్యార్థుల‌ విషయానికి వస్తే ఏపీలో 5,600 మంది ఉంటే.. తమిళనాడులో 29 వేల మంది ఉన్నారు. ప్రస్తుతానికి మనవద్ద ఎలాంటి ట్రాకింగ్ మెకానిజం కూడా లేదన్నారు.

విద్యార్థుల ప్లేస్ మెంట్స్, ఏయే కంపెనీలు వ‌చ్చాయి..ఎంత మందికి వేత‌నాలు ద‌క్కాయ‌నే వివరాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లీప్( లెర్నింగ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఏపీ) పేరుతో సెక్టర్స్ స్పెసిఫిక్ ఇన్ స్టిట్యూషన్స్ పై దృష్టి పెట్టి కాలేజీలు, పాలిటెక్నిక్ లు, ఐటీఐ, యూనివర్సిటీలతో క్లస్టరింగ్ చేయాలనేది నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు.

పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీతో మాట్లాడినప్పుడు కంప్యూటర్ సైన్స్ సీట్లు అన్నీ భర్తీ అవుతున్నాయి. లాంగ్వేజెస్, ఆర్ట్స్ సీట్లు భర్తీ కావడం లేదు. విద్యార్థులు వీటిపై శ్రద్ధ చూపించడం లేదు. మేం మొన్న మా పదో తరగతి మిత్రులతో కలిసినప్పుడు 42 మందిలో ఇద్దరు ఇతర దేశాల్లో లాంగ్వేజెస్ పై రీసెర్చ్ చేస్తున్నారు. లాంగ్వేజెస్ కు సంబంధించిన వర్క్స్ చేస్తున్నారు. అన్నింటిని పరిశ్రమలతో అనుసంధానిస్తాం. ఇంటర్నషిప్ వర్క్ బేస్డ్ లెర్నింగ్ తీసుకువస్తామ‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments