NEWSANDHRA PRADESH

వాట్సాప్ వ‌ద్దు మెయిల్ ఐడీకి పంపండి

Share it with your family & friends

విన్న‌వించిన ఏపీ మంత్రి నారా లోకేష్

అమ‌రావ‌తి – ఏపీ మంత్రి నారా లోకేష్ కు చెందిన వాట్సాప్ కు మెస్సేజ్ లు, విన‌తులతో ఒక్క‌సారిగా నిండి పోయింది. దీంతో మెటా త‌న వాట్సాప్ ను బ్లాక్ చేసిందంటూ స్వ‌యంగా లోకేష్ వెల్ల‌డించారు. గురువారం ఆయ‌న ఎప్ప‌టి లాగే ప్ర‌జా ద‌ర్బార్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు.

ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్‌లతో సాంకేతిక సమస్య తలెత్తింద‌న్నారు. మీ సమస్యలు దయచేసి త‌న‌కు వాట్సప్ చేయొద్దని కొరారు. మీ సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇక నుంచి నా పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in పంపించాల‌ని నారా లోకేష్ కోరారు.

పాదయాత్రలో యువతకు త‌న‌ను చేరువ చేసిన “హలో లోకేష్” కార్యక్రమం పేరుతోనే నా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నాన‌ని తెలిపారు. మీ పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందు పరిచి మెయిల్ చేయాల‌ని సూచించారు నారా లోకేష్.

ఇదే స‌మ‌యంలో సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు, వారి సమస్యల పరిష్కారం కోసం తాను నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తోందన్నారు.