యువత జాబ్ క్రియేటర్స్ గా ఎదగాలి
పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేష్
అమరావతి – రాష్ట్ర భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధానంగా టెక్నాలజీ మారుతోందని, దానికి అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే వెనుకబడి పోయే ప్రమాదం పొంచి ఉందన్నారు మంత్రి.
అమరావతిలోని వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ (IHEF)ను నారా లోకేష్ ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన అధునాతన డ్రైవర్ లెస్ వ్యాన్, డ్రోన్, రోబోట్ వంటి నవీన ఆవిష్కరణలను పరిశీలించారు
అనతరం యూనివర్శిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు నారా లోకేష్. యువతీ యువకులు ఉద్యోగాల కోసం వేచి చూడడం కాకుండా కొలువులను సృష్టించే విధంగా ఎదగాలని పిలుపునిచ్చారు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకోవాలని స్టార్టప్‌లను ప్రారంభించాలని సూచించారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ఇన్నొవేషన్ సొసైటీ సంపూర్ణ సహాయ, సహకారాలను అందిస్తుందని భరోసా ఇచ్చారు నారా లోకేష్.
భారత్ మోడల్ విద్యా వ్యవస్థను ఇతర దేశాలు అనుసరించేలా తీర్చి దిద్దాలని కోరారు. ప్రముఖ విశ్వ విద్యాలయాలతో కనెక్ట్ కావడానికి విట్–ఏపీ వేదికను అందించడం అభినందనీయం అన్నారు మంత్రి.