NEWSANDHRA PRADESH

గెలుపు కోసం బాబు దిశా నిర్దేశం

Share it with your family & friends

ప‌క్కాగా 160కి పైగానే సీట్లు ఖాయం

విజ‌య‌వాడ – రాష్ట్రంలో ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. శ‌నివారం బెజ‌వాడ‌లో ఎన్డీఏ ఆధ్వ‌ర్యంలో వ‌ర్క్ షాప్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి కీల‌క‌మైన నేత‌లు హాజ‌ర‌య్యారు.

ఇదే స‌మ‌యంలో అసెంబ్లీ బ‌రిలో నిలిచే 175 మంది అభ్య‌ర్థులు, ఆశావ‌హులతో పాటు 25 లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి పోటీ చేయ‌నున్న వారు కూడా హాజ‌ర‌య్యారు. వీరితో ఆయా పార్టీల‌కు చెందిన ముఖ్య నేత‌లు విధిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతోంద‌న్నారు. దీనిని అడ్డుకుని సీఎంను ఇంటికి పంపించాలంటే మూడు పార్టీల‌కు చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు క‌లిసిక‌ట్టుగా పని చేయాల‌ని పిలుపునిచ్చారు. వారంద‌రికీ దిశా నిర్దేశం చేశారు.

అనంత‌రం టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్ర‌సంగించారు. ఈసారి ఎన్డీయే కూట‌మిదే విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌తో ప‌ని చేయాల‌ని సూచించారు. గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌న్నారు.