విశాఖ కోర్టుకు హాజరైన లోకేష్
సాక్షిపై పరువు నష్టం దావా
విశాఖపట్నం – ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. తనపై సాక్షి పత్రిక రాసిన తప్పుడు కథనానికి సంబంధించి జిల్లా కోర్టుకు హాజరయ్యారు.
12వ అదనపు జిల్లా కోర్టు వాయిదాకు లోకేష్ హాజరయ్యారు. సాక్షి పత్రిక తప్పుడు కథనాలపై నారా లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్నారు. 2019 అక్టోబర్ 22 న ‘చినబాబు చిరుతిండి రూ. 25 లక్షలండి’ పేరుతో సాక్షిలో అసత్య కథనాన్ని ప్రచురించారు.
అవాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షిపై మంత్రి లోకేష్ రూ. 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఉద్దేశ పూర్వకంగా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడంపై ఈ కేసు దాఖలు చేశారు. ఆగస్టు 29న తొలిసారి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఈరోజు మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. పదే పదే అసత్యాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారంటూ వైసీపీపై, ఆ పార్టీ బాస్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజా సొమ్మును ఎలా మెక్కారో జనానికి తెలుసన్నారు. తాము పూర్తి పారదర్శక పాలన అందజేస్తున్నామని చెప్పారు.